ఆధ్యాత్మిక విశ్వ గురువు సైoటిఫిక్ సెయింట్ పూర్ణ గురువులు, శ్రీశ్రీశ్రీ గురు విశ్వ స్ఫూర్తివారి దివ్య ఆశీస్సులతో ఏర్పాటైన స్ఫూర్తి కుటుంబం ట్రస్ట్, ఆంధ్ర ప్రదేశ్ అనేక కార్యక్రమములు నిర్వహిస్తున్న విషయం విదితమే. శ్రీశ్రీశ్రీ గురు విశ్వ స్ఫూర్తివారి రచనలను, సందేశాలను, ఆయన ప్రతిపాదించిన ధ్యానమనోప్రస్థానం, ప్రాక్టికల్ ఫిలాసఫీ, రిలీజియస్ హ్యూమానిటీ సిద్ధాంతాలను జన బాహుళ్యానికి తెలియ జేయడం ట్రస్ట్ ముఖ్య లక్ష్యం. అందుకు ఆచరణాత్మకంగా ఆసన, ప్రాణాయామ, ధ్యాన విధానాన్ని ఉచితంగా నేర్పించటంతో
ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో శ్రీ గురుదేవులు రచించిన, గ్రంథపఠనం, గ్రంథ సమీక్ష, చర్చావేదికలు, నిర్వహించడం వంటి కార్యక్రమాలు సత్సంగాలు, పరిచయ వేదికలు, కొన్ని పండుగలు, కొన్ని ముఖ్యమైన సందర్భాలలో సభలు, సమావేశాలు మొదలైనవి నిర్వహించి, ప్రజలలో అవగాహన కల్పిస్తూ ఉంటుంది. ఈ విధమైన జ్ఞాన సాధన, ధ్యానసాధనతో వ్యక్తి లో మార్పు, తద్వారా కుటుంబ మార్పు జరిగి సమాజ మార్పుకు దారి తీస్తుందని ‘మానవతా రక్షతి రక్షితా!’ అనే నినాదంతో పలు సేవా కార్యక్రమాలు చేపట్టి, మానవత్వం అడుగంటిన మన సమాజంలో, మానవత్వాన్ని మేల్కొల్పాలన్న శ్రీ గురుదేవుల ఆశయ సిద్ధికై కృషి చేయడం తమ ధ్యేయమని ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. ఈ సేవా కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ, పరిసర ప్రాంతాలలోని అనాథలు, ఎయిడ్స్ బాధితులైన చిన్నపిల్లలకు నిత్యావసర పదార్థాలూ, పండ్లూ పంచి, తమ దాతృత్వాన్ని, మానవతను చాటుకున్నారు.