రాజమండ్రిలో ఎన్నో ప్రసిద్ధ పురాతన ఆలయాలు ఉన్నాయని, వాటికి గత వైభవాన్ని తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ తెలిపారు. సోమవారం రాజమండ్రిలోని కోటిలింగాల పేట శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి, శ్రీ సీతారామ స్వామి వార్ల దేవస్థానం ముఖ ద్వార నిర్మాణానికి ఎంపీ శంకుస్థాపన చేశారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ ఆలయాల అభివృద్ధికి పాలకమండలి సభ్యులు చేస్తున్న కృషి ప్రశంసనీయం అన్నారు.