చైనా రాజధాని బీజింగ్‌లోని జాతీయ మ్యూజియంలో డిసెంబర్ 9న ప్రారంభమైన గ్రోటో కళ ప్రదర్శన నేటికీ వీక్షకులను ఆకట్టుకుంటోంది.
చారిత్రక కళాఖండాలు, అవశేషాలు సజీవంగా ఉన్నట్టు చూపిస్తున్న ఆధునిక ఆడియో- విజువల్స్ టెక్నాలజీ చూపరులను కట్టిపడేస్తోంది. మైమరిపింపజేస్తోంది. ఆహూతులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తోంది.