ఉరవకొండ నియోజకవర్గంలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర ముగిసింది. ఆదివారం సాయంత్రం జరిగిన బహిరంగసభకు వేలాదిగా జనం తరలివచ్చారు. మాజీఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సభలో ఆయనతో పాటు ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్, మాజీమంత్రి శంకరనారాయణ, జిల్లా పరిషత్ ఛైర్మన్ గిరిజమ్మ ప్రసంగించారు.