వైసీపీ తలపెట్టిన సామజిక సాధికార యాత్రలో భాగంగా ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ మాట్లాడుతూ.... సామాజిక సాధికారత నినాదాలతో ఉరవకొండ దద్దరిల్లిపోవడం చాలా సంతోషంగా ఉంది. జగనన్న మీద జనం ప్రేమాభిమానాలు ఎంతగా ఉన్నాయో అర్థమవుతోంది. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాక ముందు, జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఈ రాష్ట్రచరిత్రలో ప్రజలకు ఎంత మంచి జరిగిందో అర్థమవుతుంది. ఇచ్చిన ప్రతిహామీని నెరవేర్చిన జగనన్న మాటతప్పని నాయకుడు. చంద్రబాబు గతంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని అధికారంలో ఉన్నప్పుడు నెరవేర్చలేదు. మళ్లీ ఇప్పుడు కొత్త హామీలతో జనం ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. మళ్లీ మనం చంద్రబాబును నమ్మితే, నట్టేట మునగడమే. చంద్రబాబు హయాంలో చదువుల పేరిట, ఆరోగ్యం పేరిట పేదలు అప్పుల పాలయ్యారు. జగనన్న పాలనలో అందరూ సుభిక్షంగా ఉన్నారు. పిల్లల చదువు భారం తల్లిదండ్రుల మీద లేదిప్పుడు. చదివే పిల్లలకు ఎంత పెద్ద చదువులైనా చేయిస్తానని జగనన్న చెబుతున్నాడు. ఆ మేరకు పథకాలు తెచ్చారు. అనారోగ్యం పాలయినప్పుడు గతంలో దిక్కుతోచని పరిస్థితి ఉండేది. అప్పులు చేయక తప్పని పరిస్థితి. అది కాకపోతే ..ప్రాణాలమీద ఆశ వదులుకోవాల్సిందే . ఈరోజు వైద్యానికి పోతే అప్పుల పాలయ్యే పరిస్థితి పోయింది. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.25లక్షల మేరకు వైద్యసేవలు అందేలా చేశారు జగనన్న. రాష్ట్రంలో సంక్షేమం, అభివద్ధి కోసం జగనన్న ఎంతగానో కృషి చేస్తున్నారు. వర్తమానంలో ప్రజలు సుఖసంతోషాలతో ఉండటమే కాకుండా, వారి పిల్లల భవిష్యత్తు బాగుండాలని... జగనన్న ఎంతో ముందు చూపుతో కార్యక్రమాలు చేస్తున్నారు అని అన్నారు.