ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి వైసిపి తీవ్రంగా ప్రయత్నిస్తోందని టిఎన్టియుసి జిల్లా అధ్యక్షులు పోతుల లక్ష్మీనరసింహులు అన్నారు. సోమవారం నగరపాలక సంస్థ వద్ద మున్సిపల్ వర్కర్స్ యూనియన్ చేపట్టిన సమ్మె శిబిరానికి టిఎన్టియుసి జిల్లా అధ్యక్షులు పోతుల లక్ష్మీనరసింహులు సంఘీభావం ప్రకటించి, మద్దతు తెలియజేశారు.