పెత్తందార్లు చంద్రబాబు అండ్ కో...పేదల మనిషి సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అంటూ మంత్రి జోగి రమేష్ అభివర్ణించారు. పెత్తందార్లకు తోడుగా ఢిల్లీ నుంచి ఓ జాతీయ పార్టీ రాబోతుందన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా 2024 ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీదే విజయమని, వైయస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. అయన మాట్లాడుతూ.... పేదలకి, పెత్తందార్లకు జరుగుతున్న యుద్ధం..ఈ యుద్ధంలో జగనన్న వైపు నిలబడి, ఫ్యాన్ గుర్తుకు ఎప్పుడు ఓటేయాలా అని ప్రజలంతా తహతహలాడుతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ క్రీడను ఒక సారి గమనించండి. పేదల పక్షాన, బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ,అగ్రవర్ణ పేదల పక్షాన నిలిచిన వ్యక్తి జగనన్న. చంద్రబాబు, పవన్ కల్యాణ్, రామోజీ, రాధాకృష్ణ, టీవీ5 నాయుడు, లోకేశ్ వీళ్లంతా పెత్తందార్లు. ఢిల్లీ నుంచి వీళ్లందరికీ మద్దతుగా ఒక జాతీయ పార్టీ అడుగుపెట్టబోతోంది. పేదల కోసం ఆరాటపడుతున్న పేదల మనిషైన జగనన్నను ఓడించాలని అందరూ కలసి కట్టుగా కుట్రలతో రాబోతున్నారు. బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలు, కాపులు..అందరూ ఈ ప్రభుత్వం నేడు భాగస్వాములు.. రాష్ట్రంలో నేడు 17 మంది బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలకు మంత్రి పదవులు ఇచ్చి గౌరవించిన జగనన్న. 9 రాజ్యసభ సభ్యుల్లో 4 స్థానాలు బీసీలకే ఇచ్చి గౌరవించారు. ఎమ్మెల్సీ, ఛైర్మన్‌ల స్థానాలిచ్చారు. వారంతా సామాజిక సాధికారిక యాత్ర ద్వారా రాష్ట్రం అంతా తిరిగివస్తోంటే ప్రతిపక్షాలు బేంబెలేత్తిపోతున్నాయి అని అన్నారు.