పొదలకూరులో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. విజయవాడ నడిబొడ్డున రూ. 404 కోట్లతో నిర్మించిన 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఈనెల 19న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆవిష్కరించనున్న నేపథ్యంలో రాష్ట్రమంతా పండగ వాతావరణం లో అంబేద్కర్ కు ఘన నివాళులర్పించేలా జన్ బాగీదారి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పొదలకూరులో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కాకాణి పాల్గొన్నారు. అంబేద్కర్ స్ఫూర్తి భావితరాలకు తెలిసేలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంబేద్కర్ విగ్రహాల వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులర్పించేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అంబేద్కర్ జీవిత చరిత్ర పై విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్ పోటీల నిర్వహిస్తున్నామన్నారు. అంబేద్కర్ లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తూ ఎస్సీ ఎస్టీ బీసీలకు 50శాతం పదవులు కేటాయించి, వారికి సముచిత గౌరవం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిదే అని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు.