వైసీపీ తలపెట్టిన సామజిక సాధికార యాత్రలో భాగంగా మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ.... ఈ నాలుగున్నరేళ్లలో జగనన్న ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ వర్గాలతో పాటు, అగ్రవర్ణాల పేదల జీవితాల్లో ఎంతో మార్పు తీసుకొచ్చారు. సామాజిక సాధికారతతో రాష్ట్రరాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు సీఎం జగన్మోహన్రెడ్డి. నలుగురు డిప్యూటీ సీఎంలను ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ వర్గాల నుంచే తీసుకున్నారంటే..అణచివేయబడ్డ వర్గాల పట్ల జగనన్నకు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. మన పేదల, బడుగు,బలహీనవర్గాల ప్రజలకు ఆత్మగౌరవం అందించారు జగనన్న. వారి స్థాయిని పెంచారు. ఆర్థికస్థాయిని పెంచారు. రేపటి ఎన్నికలు పేదలకు, పెత్తందారుల మధ్య జరుగుతాయి. జగనన్న పేదల పక్షం. మన పక్షం. ఆయనను మళ్లీ గెలిపించుకోవడం మన బాధ్యత అని పిలుపునిచ్చారు.