రాష్ట్ర పరిధిలోని విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో సంచార జాతుల వర్గాలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించాలని సంచార జాతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై. శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఆదివారం గుంతకల్లు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద సంచార జాతుల బహిరంగ సభను నిర్వహించారు. శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రభుత్వాలు సంచార జాతులను ఓటు బ్యాంకుగా చూస్తున్నాయని వారి అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన అన్నారు.