భారత దేశంలోని వివిధ ప్రాంతాల్లో రకరకాల పేర్లతో భోగి, మకర సంక్రాంతి పండుగలను జరుపుకుంటారు. భోగి రోజున భోగి మంటలు వేస్తారు. ఇటువంటి పండుగను ఇరాన్‌లో చహర్‌షన్‌బే సూరి జరుపుకుంటారు.
ఈ పండుగ ఉద్దేశం ఏమంటే అగ్ని శక్తితో నింపబడాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటారు. ప్రజలు రాత్రి సమయంలో ప్రజలు తమ ఇండ్ల ఎదుట మంటలను వెలిగించి దానిపై నుంచి దూకుతారు.