విజయనగరం జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో నమ్మించి మోసాలకు పాల్పడే వారిపై విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని అదనపు ఎస్పీ ఆష్మాపరహీన్ పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించి 35 ఫిర్యాదులు స్వీక రించారు. ఫ విజయనగరానికి చెందిన వ్యక్తి అదనపు ఎస్పీ ఆష్మాపరహీన్‌కు ఫిర్యా దు చేస్తూ తన కుమారుడికి ఉద్యోగం కల్పిస్తానని నమ్మించి వ్యవసాయ మార్కెట్ కమిటీలో పనిచేస్తున్న వ్యక్తి తమ నుంచి రూ.3 లక్షలు తీసుకున్నారని తెలిపారు. ఉ ద్యోగం కల్పించకపోవడంతో తిరిగి డబ్బులు ఇచ్చేయాలని కోరినప్పటికీ ఇవ్వడం లే దని...న్యాయం చేయాలని కోరారు. ఫ ఎల్‌కోట మండలం రేవళ్లపాలెంనకు చెందిన వ్యక్తి ఫిర్యాదు చేస్తూ ఎస్‌కోటకు చెందిన వ్యక్తి వద్ద చిట్టీలు నిమిత్తం రూ.లక్ష కట్టా మని... వాయిదా పూర్తయినప్పటికీ సంబంధిత నగదు చెల్లించడం లేదని న్యాయం చే యాలని కోరారు. ఫ సంతకవిటి మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి ఫిర్యాదు చేస్తూ, తాను 19.700 టన్నుల మొక్కజొన్న పిక్కలను తెర్లాం మండలానికి చెందిన వ్యక్తికి రూ.10 లక్షలకు విక్రయించానని తెలిపారు. రూ.4 లక్షలు మాత్రమే చెల్లించి మిగిలిన మొత్తం చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదులు స్వీకరించిన ఏఎస్‌పీ ఆష్మాపరహీన్ వీటిని తక్షణమే పరిష్కరించి తీసుకున్న చర్యలను జిల్లా పోలీసు కార్యాలయానికి పంపాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ మండా జావలి ఆల్ఫాన్స్, డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, సీఐ మురళి, ఎస్‌ఐ వాసుదేవ్, ప్రభావతి తదితరులు పాల్గొన్నారు.