ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రానున్నది మా ప్రభుత్వమే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 09, 2024, 04:08 PM

ఏపీలో ఫ్రీ అండ్ ఫెయిల్ ఎన్నికలు జరుగుతాయని.. ప్రభుత్వం ఖచ్చితంగా మారుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్  స్పష్టం చేశారు. మంగళవారం టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి సీఈసీ బృందాన్ని పవన్ కళ్యాణ్ కలిశారు. ఏపీలో పరిస్థితులపై సీఈసీకి ఫిర్యాదు చేశారు. అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో ఎన్నికలు సజావుగా జరగాలని కేంద్ర ఎన్నికల సంఘం వచ్చిందన్నారు. 1/4 దొంగ ఓట్లు చేర్చారని... లా అండ్ ఆర్డర్ దిగజారిపోయిందని అన్నారు. రెండు నెలల‌ ముందే పోలీసులను మార్చి నోటిఫికేషన్ సమయానికి వాళ్లు తిరిగి వచ్చేలా ప్లాన్ చేశారని వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లను ఎన్నుకల విధులకు దూరం పెట్టమని కోరినట్లు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com