రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు కోరారు. మంగళవారం హైదరాబాదులో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో డైరీ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.