సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కడైనా కోడి పందాలు నిర్వహిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని సింగరాయకొండ ఎస్సై శ్రీరామ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సింగరాయకొండ పోలీస్ స్టేషన్ లో ఎస్సై మాట్లాడుతూ సంక్రాంతి పర్వదినాన్ని ప్రజలందరూ సంప్రదాయ బద్దంగా నిర్వహించుకోవాలని, ఎక్కడైనా పేకాట, జూదం వంటి ఆటలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.