ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించాలని ఆందోళన చేస్తుంటే పోలీసులతో బలవంతంగా నిర్బంధించడం దుర్మార్గమని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా పేర్కొన్నారు. ఆర్థిక బకాయిలు చెల్లించాలని కోరుతూ విజయవాడలో తలపెట్టిన ధర్నాకు వెళ్తున్న ఉపాధ్యాయులను అడ్డగించినందుకు నిరసనగా మంగళవారం కడప కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు సుమారు రూ. 18 వేల కోట్ల మేర చెల్లించాల్సి ఉందన్నారు.