తమిళనాడు తంజావూరు జిల్లా పూవలూరు గ్రామంలో జరిగిన దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. నవీన్, ఐశ్వర్యలకు తిరుపూర్లో పని చేసే సమయంలో ప్రేమించుకున్నారు. వేర్వేరు కులాలు కావడంతో పెళ్లికి ఐశ్వర్య తల్లిదండ్రులు ఒప్పుకోలేదు.
దీంతో నవీన్, ఐశ్వర్య రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. దీంతో ఐశ్వర్యను తల్లిదండ్రులు ఇంటికి తీసుకొచ్చి కొట్టి చంపారు. అనంతరం మృతదేహాన్ని తగులబెట్టారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.