అవినీతి నిరూపిస్తే జడ్పిటిసి రాజీనామాకు సిద్ధమేనా అని వేంపల్లి టిడిపి నాయకులు పేర్కొన్నారు. బుధవారం వేంపల్లిలో వారు మాట్లాడుతూ సోమవారం జడ్పిటిసి రవి కుమార్ రెడ్డి అవినీతిపరుడుని కాదు అవినీతి నిరూపిస్తే రాజీనామా చేస్తారని ఆయన అన్నారు. వేంపల్లిరోడ్డు వైండింగ్ లో ప్రభుత్వ నుండి కోటి 30 లక్షలు వస్తే అది లబ్ధిదారులకు ఇవ్వకుండా ఆ డబ్బులు ఏం చేశావో సమాధానం చెప్పి తర్వాత రాజీనామా గురించి మాట్లాడదామన్నారు.