వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పీవీ సిద్ధారెడ్డి తెలిపారు. కదిరి నియోజకవర్గం నంబులపూలకుంట మండలం, ఆర్కే రోడ్డు నుంచి వంకమద్ది వరకు రూ. 292 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన తారు రోడ్డు ను ఎమ్మెల్యే సిద్దారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..సీఎం వైయస్ జగన్ సహకారంతో గతంలో ఎన్నడూ లేని విధంగా 135 గ్రామాలకు రోడ్డు సౌకర్యాలను కల్పించామన్నారు. 100 సంవత్సరాల మన్నికతో 30 సంవత్సరాలలో వేయనటువంటి రోడ్లను వేసి చూపించామన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నన్ని రోజు ఎక్కడ కూడా గంపడం మట్టిని కూడా వేసిన దాఖలాలు లేవు అన్నారు. జన్మభూమి కమిటీలు అంటూ జనాలను పీక్కుతినే కార్యక్రమాలు చేశారని, జగనన్న అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నిటికి స్వస్తి చెబుతూ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థల ద్వారా నేడు ప్రభుత్వ పాలనను ప్రజల ముంగిటకు తీసుకొచ్చారన్నారు. వీటన్నిటిని చూసి ఓర్వలేక లేనిపోని అబద్దాలతో బురద చల్లే కార్యక్రమాలు చేస్తున్నారన్నారని, వారిని ప్రజలే తిప్పి కొట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, సర్పంచులు, కో ఆప్షన్ సభ్యులు, ఎంపీటీసీలు, మండల కన్వీనర్లు,జె సి ఎస్ ఇన్చార్జులు, వివిధ శాఖల చైర్మన్ లు, డైరెక్టర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, సోషియల్ మీడియా సోదరులు, పోలింగ్ బూత్ మేనేజర్లు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, కన్వీనర్లు, సంబంధిత అధికారులు, వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.