ప్రతిపక్ష నేత హోదాలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఓ చారిత్రక ఘట్టమని కర్నూలు మేయర్ బీవై రామయ్య అన్నారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర పూర్తయి నేటికి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా కర్నూలు నగరం లోని వైయస్ఆర్ సర్కిల్‌లో కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. వైయస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. ఈ సంధర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డికి వైయస్ఆర్ సిపి శ్రేణులు శుభాభినందనలు తెలిపారు.రాష్ట్ర ప్రగతి, ప్రజా సంక్షేమాన్ని ఓ మేలిమలుపు తిప్పిన ప్రజా సంకల్పయాత్ర లాంటి చారిత్రక ఘట్టంలో మనమంతా భాగస్వామ్యులు అయినందుకు గర్వపడు చున్నామని బి.వై రామయ్యా పేర్కొన్నారు. నిరాశ, నిస్పృహలకు లోనై ఆందోళన చెందుచున్న రాష్ట్ర ప్రజలకు నేనున్నాను ఆంటూ ధైర్యం చెప్పి జనంతో కలసి అడుగులు వేసిన వైయస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రకు ఐదేళ్లు పూర్తి అయ్యిందని చెప్పారు. . రాష్ట్ర ముఖ్యమంత్రి గా వైయస్ జగన్ మోహన్ రెడ్డి సాగిస్తున్న పాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. పాదయాత్రలో తెలుసుకున్న ప్రజల కష్టాలు, వారి కన్నీళ్లను, కుంటుబడిన అభివృద్ధిని కళ్లారా చూసి విన్న ముఖ్యమంత్రి నేడు అనేక సంక్షేమ పథకాలుతో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమంలో భాగమయ్యారన్నారు. అధికారంలోకి వచ్చినప్పుడు నుంచి రాజకీయాలు వదిలిపెట్టి ప్రజలకిచ్చిన హామీలను కులం, మతం, ప్రాంతం, పార్టీలను చూడకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందిస్తూ మహానేత వైఎస్ఆర్ తనయుడిగా ముందుకు సాగుచున్నారన్నారు. కార్యక్రమంలో నగర ఆధ్యక్షురాలు సత్యనారాయణమ్మ, గోశాల చైర్మన్ ఆది మోహన్ రెడ్డి, రైల్వే ప్రసాద్, కో-ఆప్షన్ మెంబెర్ నయీం పాషా,క్లస్టర్ ప్రెసిడెంట్ కేదార్ నాథ్,క్లస్టర్ ప్రెసిడెంట్ మాబుస , కార్పొరేటర్లు యూనుస్‌బాష, తదితరులు పాల్గొన్నారు.