వైసీపీ చేపట్టిన సామజిక సాధికార యాత్రలో భాగంగా మాజీ మంత్రి శంకరనారాయణ మాట్లాడుతూ.... ఈ రాష్ట్రంలో మునుపెన్నడూ లేని రీతిలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలకు అన్ని రంగాల్లోనూ పెద్దపీట వేశారు. చట్టసభల్లో పదవులతో పాటు, కార్పొరేషన్ల ఛైర్మన్లగాను, డైరెక్టర్లుగా చేసిన జగనన్న సామాజిక న్యాయమంటే ఏమిటో చేసి చూపారు. సామాజిక,రాజకీయ,ఆర్థిక రంగాల్లో ...బడుగు,బలహీనవర్గాల నుంచి వచ్చిన వారి స్థాయిని పెంచాలని చిత్తశుద్దితో కృషి చేస్తున్నారు జగనన్న.వైసీపీ చేపట్టిన సామజిక సాధికార యాత్రలో భాగంగా జెడ్పీ ఛైర్మన్ గిరిజమ్మ మాట్లాడుతూ... మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బడుగు, బలహీనవర్గాలకు ఎంతో మేలు చేస్తున్నారు. సంక్షేమ పథకాలతో బడుగు బలహీనవర్గాల ఆర్థికస్థాయిని పెంచడమే కాకుండా, పదవులిచ్చి రాజకీయ స్థాయిని పెంచారు. సామాజిక స్థాయిని పెంచారు. నాడు–నేడు పథకంతో అటు విద్యారంగంలోను, ఇటు వైద్యరంగంలోనూ అద్బుతమైన మార్పులకు శ్రీకారం చుట్టారు జగనన్న. పేదవారి జీవితాల్లో వెలుగులు పంచిన జగనన్న మళ్ళీ సీఎం కావాలి...అప్పుడే బడుగు,బలహీన, అణచివేయబడ్డ వర్గాలకు చెందిన ప్రజలంతా సంతోషంగా ఉంటారు అని అన్నారు.