ఎంపీ కేశినేని నానికి టీడీపీ నేత బుద్దా వెంకన్న మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇక ఆట మొదలైందని, రెడీగా ఉండాలంటూ హెచ్చరించారు. బుధవారం టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్‌పై కేశినేని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో స్పందించిన బుద్దా వెంకన్న.. నానిపై ఫైర్ అయ్యారు. క్యారెక్టర్ లేని కేశినేని నాని ఏదేదో మాట్లాడాడని విమర్శించారు. రెండుసార్లు నానిని ఎంపీ చేసింది చంద్రబాబే అని గుర్తు చేశారు. నానిని తిట్టమని తనను చంద్రబాబు ఏమీ ఆదేశించలేదన్నారు. వాస్తవానికి తాను నానిని తిట్టినప్పుడు చంద్రబాబు తనను మందలించారని చెప్పారు. చంద్రబాబు చెప్పారు కాబట్టే ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉన్నానని అన్నారు.వైసీపీ ఎంపీ విజయసాయితో కేశినేని నానికి ఎప్పటి నుంచో పరిచయం ఉందని, ఆయన వైసీపీ కోవర్టు అని తీవ్ర ఆరోపణలు చేశారు బుద్దా వెంకన్న. తాను చంద్రబాబు కాళ్లు మొక్కుతానని నాని అంటున్నారని.. ఇవాళ నాని వెళ్లి జగన్ కాళ్లు మొక్కాడని విమర్శించారు. కేశినేని నానికి ముందుంది అసలు సినిమా అని అన్నారు. సొంత తమ్ముడు కేశినేని చిన్ని భార్య జానకి మీద కేసు పెట్టించిన వ్యక్తి నాని అని వెంకన్న విమర్శించారు .