అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సత్యనారాయణ తెలిపారు. ప్రొద్దుటూరు స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద బుధవారం జరిగిన అంగన్వాడీల ధర్నా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్బంగా అంగన్వాడీలు రెండు చేతులు అడ్డంగా పెట్టుకొని నిరసన తెలిపారు. మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి దీక్షా శిబిరాన్ని సందర్శించి వారికి మద్దతు తెలిపారు.