హంద్రీనీవా ప్రధాన కాలువలో కృష్ణా జలాల నీటి ప్రవాహం తగ్గింది. రెండు రోజులుగా ఉరవకొండ పరిసరాల్లోని ఈ కాలువలో సగం కూడా నీరు ప్రవహించడం లేదు. దాని పరిధిలోని ఉప కాలువలకు నీటి సరఫరా స్తంభించడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఈనెల 15 వరకు నీటి ప్రవాహం ఉంటుందని రైతులు భావించారు. దానిపై అధికారులు పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. ప్రధాన కాలువతో పాటు ఉప కాలువల కింద దాదాపు 30వేల ఎకరాల వరకు మిరప పంట సాగులో ఉంది.