జాతీయ అధ్యక్షులు ఆదేశించిన జయహో బీసీ కార్యక్రమాన్ని మండలాల స్థాయిలో భారీగా నిర్వహించాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ పిలుపునిచ్చారు. గురువారం గూడూరు టీడీపీ కార్యాలయంలో నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల పార్టీ అద్యక్షులు శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు రాజు, వెంకటేశ్వర్లు రెడ్డి, మధు సుధన్ రెడ్డి, కిషోర్ నాయుడు, చెంచురామయ్య, లీలావతి తదితరులు పాల్గొన్నారు.