మల్కాపురం ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఓ రెస్టారెంట్ బుధవారం అర్ధరాత్రి మంటలకు ఆహుతి అయింది. వైసిపి నాయకుడు సోమధుల సురేష్ కు చెందిన ఈ రెస్టారెంట్ వ్యాపారం ముగించుకుని ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికి ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
విషయం తెలుసుకున్న మల్కాపురం పోలీసులు ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు పక్క దుకాణాలకు వ్యాపించకుండా నివారించారు. ఐదు లక్షల పైగా నష్టం వాటిల్లిందని సురేష్ తెలిపారు.