కుటుంబ అవసరాల కోసం చదువుకుంటూ ఉద్యోగం చేస్తోన్న మైనర్ బాలికపై ఓ వైద్యుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగు చూసింది.
విశాఖపట్నంలో మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చిన్న పిల్లల వైద్యుడిగా పనిచేస్తోన్న ఓ డాక్టర్ పై బాధితురాలు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన డాక్టర్ పై పోక్సో కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.