ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నంతకాలం బీసీలకు అన్యాయం తప్ప ఒరిగేది ఏమీలేదని పద్మశాలి సంఘం అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి పోతుల లక్ష్మీనరసింహులు ఆరోపించారు. గురువారం టీడీపీ కార్యాలయంలో ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ చేనేత కులానికి సంబంధించిన కర్నూల్ ఎం. పి డాక్టర్ సంజీవ్ కుమార్ వైసీపీ పార్టీకి రాజీనామా చేశాడు అంటే బీసీ లకు విలువ లేదనే విషయం స్పష్టం అవుతోందన్నారు.