కళ్యాణదుర్గం పట్టణంలోని వాల్మీకి సర్కిల్ లో రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి గురువారం ప్రజలతో టీ తాగుతూ ప్రచారం చేపట్టారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి వైసీపీ తరఫున టికెట్ నిరాకరించడంతో కళ్యాణదుర్గం నుండే ఏ పార్టీ నుంచి అవకాశం వచ్చినా ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగుతానని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దీంతో వేకువజాము నుంచే కళ్యాణదుర్గంలో ప్రజలతో మమేకమవుతూ పర్యటన చేపట్టారు.