నార్పల మండలం బండ్లపల్లి సచివాలయంలో గురువారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంను నిర్వహించారు. ఈ కార్యక్రమంని సర్పంచ్ పిట్టు వెంకటనారాయణమ్మ, ఎంపీటీసీ శంకర్ యాదవ్ ప్రారంభించారు. 414 మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వైద్య సిబ్బంది తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ మహేందర్ నాథ్, వైద్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.