జనవరి 9న జరిగిన ‘రా.. కదలిరా’ సభ విజయవంతం చేసినందుకు ప్రతి కార్యకర్తకి కృతజ్ఞతలు అని టీడీపీ నేత భూమా అఖిలప్రియ అన్నారు. దీనివల్ల తమ కుటుంబంపై ఆళ్లగడ్డ ప్రజల ప్రేమెంటో అర్థమైందని చెప్పారు.
నంద్యాలలో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికలలో చంద్రబాబుకు అధికారం ఇవ్వకపోతే రాష్ట్రం పరిస్థితి అథోగతేనని తెలిపారు. అందుకే ప్రజల మేలుకోరి ఎక్కువ సమయం తీసుకొని మాట్లాడారని పేర్కొన్నారు.