విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్తగా మంత్రి బొత్స సతీమణి బొత్సా ఝాన్సీని వైసీపీ కేంద్ర కమిటీ నియమించింది. ఈ మేరకు గురువారం రాత్రి ఆమె నియామకాన్ని నిర్థారిస్తూ ప్రకటన జారీ అయింది.
విశాఖ ఎంపీగా ఆమె పోటీ చేయడం దాదాపు ఖారారైనట్టే. విశాఖ నుంచి అతి కీలకమైన ఎంపీ స్థానానికి బొత్స ఝాన్సీ సరైన నాయకురాలని పార్టీ నేతలు పేర్కొంటున్నారు.