ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల విశాఖ పరిధిలో గత నెల నుంచి ఆకలి కేకలతో అలమటిస్తున్న పారిశుధ్య కార్మికులకు విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన సీనియర్ నాయకులు,
32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు గురువారం నిత్యావసరాలను అందించారు. జనసేనపార్టీ అణగారిన వర్గాలకు ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. పారిశుద్ధ్య కార్మికుల పట్ల వైకాపా ప్రభుత్వం దారుణంగా ప్రవర్తించడం ఎంతో దుర్మార్గమన్నారు.