సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కోడిపందాలు, పేకాట తదితర అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని పొన్నూరు రూరల్ ఎస్సై భార్గవ్ శుక్రవారం మీడియా సమావేశంలో తెలిపారు. సంక్రాంతి పండుగ సమీపిస్తున్న తరుణంలో ఇప్పటికే మండలంలో నిఘ పటిష్టం చేశామని గతంలో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించిన వారిని బైండోర్ చేసినట్లు పేర్కొన్నారు. పోలీసులకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.