దేశవ్యాప్తంగా ఎన్ఐఏ గురువారం దాడులు నిర్వహించింది. దేశ రాజధాని ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్లోని 32 చోట్ల దాడులు చేపట్టింది. ఇవాళ ఉదయం నుంచి దాడులు కొనసాగుతున్నాయి. హర్యానాలో గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ అనుచరులపై ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. అతని కుటుంబానికి చెందిన వారి దగ్గర రెండు తుపాకులు, 2 మ్యాగజీన్లు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకుంది.