ఏపీలో మూడు ఎక్స్ ప్రెస్ రైళ్లను పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గుంటూరులో శుక్రవారం ఈ రైళ్లను ప్రారంభించనున్నారు.
విశాఖపట్నం-విజయవాడ మధ్య నడుస్తున్న ఉదయ్ డబుల్ డెక్కర్ రైలును గుంటూరు వరకు, అమరావతి రైలును నరసాపురం వరకు పొడిగించారు. కడప వరకు నడుస్తున్న ప్రత్యేక రైలును రేణికుంట వరకు పొడిగించారు.