ఏపీ ప్రభుత్వం అంగన్వాడీలను మరోసారి చర్చలకు పిలిచింది. శుక్రవారం సాయంత్రం మూడు గంటలకు మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణలతో అంగన్వాడీ నాయకత్వం సమావేశం కానుంది. కాగా ఇప్పటికే రెండు సార్లు అంగన్వాడీలతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఈవాల్టి చర్చల్లో అయినా పరిష్కారం లభిస్తుందని, ప్రభుత్వం తమ డిమాండ్లపై స్పందిస్తుందని ఆశాభవంతో అంగన్వాడీలు ఉన్నారు.