తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత కొంతకాలంగా నిరసన దీక్షలు చేపట్టిన అంగన్వాడీలు శుక్రవారం కోటి సంతకాల విన్నపం చేపట్టారు. తణుకు రాష్ట్రపతి రోడ్డులోని స్థానిక కోర్టు సమీపంలో ఏర్పాటు చేసిన నిరసన దీక్షా శిబిరంలో అంగన్వాడీలు పాల్గొని తమ సమస్యలను పరిష్కరించాలని జగనన్నకు చెబుతాం కార్యక్రమంలో భాగంగా కోటి సంతకాల విన్నపాన్ని నిర్వహించారు.