వైసీపీ పెద్దలతో ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి జరిపిన చర్చలు విఫలమయ్యాయి అనే చెప్పొచ్చు. దీంతో శుక్రవారం సాయంత్రం తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను ఆయన కలవనున్నట్లు సమాచారం. ఇక టీడీపీలో చేరే అంశంపై ఈరోజు ఆయన మీడియాకు ఒక స్పష్టమైన సమాచారం ఇచ్చే అవకాశం ఉంది. కాగా పెనమలూరు నుంచి కాకుండా మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయాలని వైసీపీ పెద్దలు కోరగా పార్థసారథి తిరస్కరించారు. ఎంపీగా గెలిపించే బాధ్యతను ఎమ్మెల్యేలు తీసుకుంటారని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా పార్థసారథి వినలేదు. దీంతో పార్థసారథి పార్టీ మారుతున్నారని సోషల్ మీడియాలో గట్టి ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే.. సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి పిలుపు రావడంతో.. పార్థసారథి క్యాంప్ ఆఫీస్‌కు వెళ్లారు. సమన్వయకర్తలు అయోధ్యరామిరెడ్డి, మర్రి రాజశేఖర్‌తో భేటీ అయ్యారు పార్థసారథి. ఈ భేటీలో ఎమ్మెల్యేలు అనిల్ కుమార్, కొడాలి నాని కూడా పాల్గొన్నారు. ఎంపీగా పోటీ చేసేందుకు పార్థసారథిని ఒప్పించే ప్రయత్నం చేసినా.. అందుకు ఆయన అంగీకరించలేదు. మచిలీపట్నం ఎంపీగా పోటీ చేసే ప్రసక్తే లేదని పార్థసారథి స్పష్టం చేశారు.