శ్రీశైలం ఆలయం: ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయం 8.30 గంటలకు దేవస్థానం ఈవో డి.పెద్దిరాజు, అర్చకులు, వేదపండితులు యాగశాలలో ఉత్సవాల ప్రారంభ పూజలు నిర్వహించారు.సాయంత్రం 7 గంటలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ కార్యక్రమం జరగనుంది. నేటి నుంచి ఈ నెల 18 వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa