వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో వైయస్ఆర్సీపీ అభ్యర్థులు గెలుపు లక్ష్యంగా పార్టీ అధినేత, సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సీట్లు కేటాయిస్తున్నారని వైయస్ఆర్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సీఎం వైయస్ జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో బీసీలు నిర్ణక్ష్యానికి గురయ్యారని గుర్తు చేశారు. విశాఖకు పరిశుభ్రతలో అవార్డు దక్కడం సంతోషంగా ఉందన్నారు. గత ప్రభుత్వాలు విశాఖపై నిర్లక్ష్యం వహించాయని ఆయన విమర్శించారు. సీఎం వైయస్ జగన్ విశాఖ శుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు.