భారత పౌరులకు ఆధార్ ఎంతటి ముఖ్యమైన డాక్యుమెంట్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI), 12-అంకెలు ఉన్న ఆధార్‌ను భారతీయులకు జారీ చేస్తుంది.ప్రభుత్వ పథకాల లబ్ధి పొందడానికి, అనేక ఇతర అవసరాలకు ఇది ఐడెంటిటీ, అడ్రస్ ప్రూఫ్‌గా పనిచేస్తుంది. ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ కోసం వ్యక్తి ఫోటోగ్రాఫ్, ఐరిస్ స్కాన్, వేలిముద్రలు వంటి బయోమెట్రిక్ డేటా, చిరునామా వంటి డెమోగ్రాఫిక్ డేటా తీసుకుంటారు. అయితే కొన్నిసార్లు ఆధార్‌లో వ్యక్తుల ఫోటో సరిగా ఉండకపోవచ్చు. ఇలాంటప్పుడు ఫోటో మార్చుకునే అవకాశం ఉంది.
ఆధార్ కార్డులో వివరాలను అప్‌డేట్ చేయడం లేదా మార్చడం చాలా సులభం. సమీపంలోని ఏదైనా ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌కు వెళ్లి, వివరాలను అప్‌డేట్ చేసువచ్చు. అయితే ఫోటోను ఆన్‌లైన్ మోడ్‌లో మార్చుకోవడానికి అవకాశం లేదు. ఇందుకు తప్పనిసరిగా ఆధార్ కేంద్రాలకు వెళ్లాలి. ఈ సేవలకు రూ.100 ఖర్చు అవుతుంది.
* ఆధార్‌లో ఫోటోను ఎలా మార్చుకోవాలి?
- మీకు దగ్గర్లోని ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌కు వెళ్లండి.
- UIDAI అధికారిక వెబ్‌సైట్ నుంచి ఎన్‌రోల్‌మెంట్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేయండి. ఫారమ్‌లో అన్ని వివరాలను నింపి, ఆధార్ సెంటర్‌లో సమర్పించండి.
- తర్వాత సంబంధిత ప్రతినిధులు మీ బయోమెట్రిక్ వివరాలను తీసుకుంటారు, మీ ఫోటో తీస్తారు.
- అనంతరం ఈ డేటా UIDAI కార్పొరేట్ ఆఫీస్‌కు వెళ్తుంది. కొత్త ఫోటోతో అప్‌డేటెడ్ ఆధార్ రావడానికి దాదాపు 90 రోజుల సమయం పడుతుంది.
- ఆధార్ అప్‌డేట్ రిక్వెస్ట్ పూర్తయిన తర్వాత URN ఉన్న స్లిప్ ఇస్తారు. అప్‌డేట్ స్టేటస్‌ను దీని సాయంతో చెక్ చేసుకోవచ్చు.
* కొత్త ఫోటోతో అప్‌డేట్ అయిన ఆధార్ డౌన్‌లోడ్ చేసే ప్రాసెస్
- UIDAI అధికారిక పోర్టల్‌కి లాగిన్ అవ్వండి. హోమ్‌పేజీలోని My Aadhaar విభాగంలో 'డౌన్‌లోడ్ ఆధార్' ఆప్షన్ సెలక్ట్ చేయండి
- ఇక్కడి నుంచి ఇ-ఆధార్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందుకు 'ఆధార్ నంబర్', 'ఎన్‌రోల్‌మెంట్ ఐడీ', 'వర్చువల్ ఐడీ'లో ఏదో ఒక ఆప్షన్ సెలక్ట్ చేయాలి.
- క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత, మీ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్‌కు OTP వస్తుంది.
ఓటీపీ ఎంటర్ చేస్తే, పాస్‌వర్డ్ ప్రొటెక్టెడ్ ఇ-ఆధార్ మీ డివైజ్‌లో డౌన్‌లోడ్ అవుతుంది.
- మీ పేరులోని మొదటి నాలుగు అక్షరాలను క్యాపిటల్ లెటర్స్‌లో టైప్ చేసి, మీ పుట్టిన సంవత్సరం ఎంటర్ చేయాలి. ఇదే మీ ఇ-ఆధార్ పాస్‌వర్డ్.