వెనుకబడిన వర్గాలకు వైయస్ఆర్ సీపీ మరోసారి రాజకీయ ప్రాధాన్యత కల్పించింది. విధేయతను గుర్తిస్తూ.. పార్టీ కోసం తొలి నుంచి పనిచేస్తున్న నేతలను గౌరవించింది. రానున్న ఎన్నికల దృష్ట్యా పలు నియోజకవర్గాలకు కొత్త ఇన్‌చార్జిలను నియమించింది. పార్లమెంట్ ఇన్‌చార్జిగా రాష్ట్ర కళింగ కార్పొరేషన్ చైర్మన్ పేరాడ తిలక్‌ను ని యమించగా, ఇచ్ఛాపురం అసెంబ్లీ నియోజకవర్గం ఇన్‌చార్జిగా ప్రస్తుత జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పిరియా విజయను, టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం ఇన్‌చార్జిగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ను నియమించింది. ప్రస్తుత జెడ్పీ చైర్‌పర్సన్ పిరియా విజయను, అసెంబ్లీ ఇన్‌చార్జిగా నియమించడంతో ఆమె స్థానంలో ఇచ్ఛాపురం జెడ్పీటీసీగా పనిచేస్తున్న ఉప్పాడ నారాయణమ్మను నియమించారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.