గుంతకల్లు మండలంలోని పులగుట్టపల్లి పెద్దతండా గ్రామానికి చెందిన వైకాపా నాయకుడు చినస్వామి నాయక్ కుమారుడు చదువుకు గురువారం ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి తన క్యాంపు కార్యాలయంలో రూ. 25 వేలు ఆర్థిక సాయం(చెక్కు) అందించారు. ఈ కార్యక్రమంలో ఆగ్రామ సర్పంచ్ వెంకటేష్ నాయక్, మండల సచివాలయం కన్వీనర్ గోవింద్ నాయక్, మాజీ సర్పంచ్ వెంకటేష్ నాయక్, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.