గుంతకల్లు పట్టణంలోని పాత బస్టాండు వద్ద గురువారం సాయంత్రం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై (ఈవిఎం, వివి ప్యాడ్స్ )రెవిన్యూ అధికారులు మొబైల్ వాహనంలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఆర్డీవో శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ వి. కమిషనర్ మల్లికార్జున, తహశీల్దారు ప్రతాప్ రెడ్డి, డిప్యూటీ తహశీల్దారు రాము ఓటింగ్ యంత్రాల వాహనంలో వివి ప్యాడ్, కంట్రోలు యూనిట్, ఓటింగ్ విధానంపై ప్రజలకు అవగాహన కల్పించారు.