ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాలో ఓ ప్రయాణికురాలికి చేదు అనుభవం ఎదురైంది. ఈనెల 8న కాలికట్ నుంచి ముంబై వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో వీరా జైన్ అనే మహిళ ప్రయాణించింది.
ఆ విమానంలో వెజ్ భోజనం ఆర్డర్ చేసింది. కానీ అందులో చికెన్ ముక్కలు వచ్చాయి. ఈ మేరకు ఆ ఆహార ప్యాకెట్‌పై ‘వెజ్ మెయిన్ మీల్’ అని రాసి ఉన్నా, అందులో చికెన్ రావడంతో షాక్ అయ్యింది. ఆ ఫుడ్‌ను ఫొటోలు తీసి ఎక్స్‌లో షేర్ చేయగా వైరల్ అవుతోంది.