బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురం గ్రామంలో పైపులు బ్లాక్ అయి నీరంతా రోడ్డుపై నీరు ప్రవహిస్తోందని శుక్రవారం గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు సమస్య చెప్పిన ఎవరు స్పందించడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటికుంటల వలన దోమలు ఎక్కువగా ఉన్నాయని చిన్నపిల్లలకు దోమలు కుట్టి విష జ్వరాలు వస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.