అద్దంకి మండలం అద్దంకి పట్టణానికి చెందిన కృష్ణ అనే వ్యక్తి భవాని సెంటర్ నందు అక్రమంగా మద్యం అమ్ముతున్నాడనే సమాచారంతో ఎస్సై వెంకటేశ్వర్లు గురువారం రాత్రి తన సిబ్బందితో కలిసి దాడి చేశారు. అతని వద్ద నుంచి 12 అక్రమ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా అక్రమంగా మద్యం అమ్మితే శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై వెంకటేశ్వర్లు హెచ్చరించారు.