రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన వ్యక్తి చంద్రబాబు. పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా ఉన్నట్లు ఉంది చంద్రబాబు వైఖరి. డబ్బులకు టికెట్లను అమ్ముకునే వ్యక్తి చంద్రబాబు. సర్వేల తరువాత అభ్యర్థుల మార్పు జరిగింది. సంక్రాంతి లోపు టికెట్లు ప్రకటిస్తానన్న చంద్రబాబు.. ఎందుకు చేయలేదు? అభ్యర్థులు లేకే ఆయన పొత్తులు పెట్టుకొని వెళ్తున్నాడు. పవన్ కళ్యాణ్, లోకేష్ కూడా రెండు చోట్ల పోటీకి సిద్ధమవుతున్నారు. అన్ని పార్టీలతో కలిసి చంద్రబాబు వచ్చినా సీఎం వైయస్ జగన్ను ఏమి చేయలేరు. ఏపీలో లేని నాయకులంతా ఏకమై వస్తున్నారు. పవన్ను ప్రజలు రెండు చోట్ల ఓడించినప్పుడే పవన్ పరిస్థితి అర్థమయ్యిందని మంత్రి రోజా వ్యాఖ్యానించారు.