వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలుపు దిశగా పయనింప చేసే బాధ్యత పార్టీ సోషల్ మీడియాపై ఉందని రాజాం నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ తలే రాజేష్ పేర్కొన్నారు. శుక్రవారం రాజాం అసెంబ్లీ సోషల్ మీడియా, మండలాల కన్వీనర్లు, కో-కన్వీనర్లుతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వైసీపీ, నేను మీకు అండగా ఉంటామని, సంక్షేమ పథకాలు, అభివృద్ధి విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు.